Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో బాలికను వేధిస్తున్న కానిస్టేబుల్.. వీడియో తీసి ఫిర్యాదు చేసిన పేరెంట్స్

UP conistable misbehaving with school girl
Advertisement
  • స్కూలుకు వెళుతుండగా వెంటపడుతూ వేధింపులు
  • తల్లిదండ్రులకు చెప్పిన బాలిక.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పేరెంట్స్
  • కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
  • పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
ఉత్తరప్రదేశ్ లో ఓ స్కూలు విద్యార్థినిని వేధింపులకు గురిచేశాడో కానిస్టేబుల్.. స్కూలుకు వెళుతున్నపుడు, తిరిగి ఇంటికెళుతున్నపుడు వెంటపడుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధించాడు. దీంతో ఆ బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. మరుసటి రోజు స్కూలుకు వెళుతుండగా వెనకే వెళ్లిన తల్లిదండ్రులు.. కానిస్టేబుల్ వేధింపులను మొబైల్ లో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లక్నోలోని కాంట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాదత్ అలీ కొన్ని రోజులుగా స్కూలు విద్యార్థినిని వేధిస్తున్నాడు. సైకిల్ పై వెళుతున్న బాలికను స్కూటర్ తో వెంబడిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిఘా పెట్టి కానిస్టేబుల్ నిర్వాకాన్ని వీడియో తీశారు. దానిని ఉన్నతాధికారులకు అందజేసి, సాదత్ అలీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. సాదత్ అలీని వెంటనే సస్పెండ్ చేశారు. ఆపై పోక్సో కేసు పెట్టి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement
Uttar Pradesh
Police
conistable
lucknow
pocso case

More Telugu News